8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

శోచనీయమే .. పెద్ద నోట్లు రద్దు . పెద్ద నోట్లే సరఫరా .. చిల్లర కు డిమాండ్ . ఆగిన ట్రాన్సాక్షన్స్ . మీడియా లో అరుపులు ,కేకలు .. రోడ్డెక్కిన జనాభా .. వీటన్నింటి మధ్యా ఎస్ బి ఐ 7000 కోట్ల రుణమాఫీ .. ఉన్నవాడే ఎప్పుడూ అదృష్టవంతుడు. మర్యాదలూ వారికే హక్కు . రుణాలూ వారికే హక్కు .. ఆదాయపన్ను మినహాయింపులు ,రుణమాఫీలు .. సమాజంలో విస్తృతంగా ,సగర్వంగా  బ్రతికే, దర్జాగా బ్రతికే హక్కూ వారిదే మరి .. చిల్లర నోట్లకు , ఓట్లకు మాత్రమే డబ్బులేని వారు పరిమితం .. అర్ధరూపాయి విలువ కేవలం పేదవాడికే తెలుసు మరి . పెద్దవాళ్ళకి అర్ధరూపాయితో అసలు పనే  ఉండదు కదా ..      

6, జులై 2016, బుధవారం

శోచనీయం : వయసు మళ్ళిన లేదా పెరిగిన లేదా శరీరం సడలిన వారు (వృ...

శోచనీయం : వయసు మళ్ళిన లేదా పెరిగిన లేదా శరీరం సడలిన వారు (వృ...: వయసు మళ్ళిన లేదా పెరిగిన లేదా శరీరం సడలిన వారు (వృద్దులు అని ఎందుకో అనలేకపోతున్నాను ) కూడా స్వేచ్ఛ  కోరుకుంటున్నారు .. నా అనుభవం మరియు పరిశ...
వయసు మళ్ళిన లేదా పెరిగిన లేదా శరీరం సడలిన వారు (వృద్దులు అని ఎందుకో అనలేకపోతున్నాను ) కూడా స్వేచ్ఛ  కోరుకుంటున్నారు .. నా అనుభవం మరియు పరిశీలన తర్వాత చాలా విషయాలు అర్ధమవుతున్నాయి .. పూర్వకాలంలో వానప్రస్థాశ్రమం అని ఎందుకు అనేవారో ఇప్పుడు అర్ధం ఆవుతుంది .. నాలో ఒక ఆశయం ఉండేది .. మరుగున పెట్టాను .. ఇప్పుడే ఆ ఆశయానికి రూపకల్పన ఇద్దాము అన్న ఆలోచన కలుగుతుంది ..       

30, డిసెంబర్ 2015, బుధవారం

స్వాగతం మిత్రమా ............





ఆంగ్ల నూతన సంవత్సరం ఐనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా జరుపుకునే ఉత్సవం .. అందరూ తమ తమ సంబందీకులతో ఆనందంగా గడిపే రోజు.. ఆ రోజు పాత స్మృతులు అన్నీ మరచిపోయి నూతన ఉత్సాహంతో వుంటారు .. తమ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాత విషయాలు ఏవీ మనసులోనికి రానీయకుండా మనస్పూర్తిగా ఇతరులని పలకరించి శుభాకాంక్షలు తెలియచేసే రోజు .. అందరికీ ఆనందకరమైన ఆ రోజుని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుదాము.  

28, అక్టోబర్ 2015, బుధవారం

పల్ దో పల్ కా

మై పల్ దో  పల్ కా... ఎంతో  అందమైన పాట ...పాట వ్రాయబడినది ఒక సినిమాలో హీరో కోసం ... తన గురించి వివరిస్తూ పాడే పాత .. కానీ ఎంతో అర్ధవంతమైన పాట . జీవితం ఏమిటో తెలిపే పాట .. అందుకే పోస్ట్ చేయడం జరిగింది     

Main Pal Do Pal Ka Shayar Hoon (Eng Sub) [Full Video Song] (HD) With Lyr...

26, అక్టోబర్ 2015, సోమవారం

భూమి మనకు నివాసయోగ్యం .. మన కన్నతల్లి . మనకి నీరు , ఆహారం, అన్ని విధాలా మనల్ని సుఖజీవనం గడిపేలా సకల సంపదలూ మన నోటికి అందిస్తున్న తల్లి . అటువంటి తల్లికి మన మీద ఎందుకు కోపం ?
ఒకప్రక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు ప్రజలు .. కారణం -డబ్బు .. అత్యాశ ...
మరోప్రక్క భూ విలయాలకు అనాధలుగా మారుతున్నారు ,మృత్యువాతకి గురి అవుతున్నారు . ఇవన్నీ చూస్తూనే వున్నాము ప్రతిరోజూ .. అయినా నిమ్మకి నీరెత్తినట్లు మౌనంగా వుండిపోతున్నాము.. మన పనులు మనం చేసుకుంటూ వేల్లిపోతున్నాము .. మనం చాలా చాలా పెద్ద వైరాగ్యులము .. ఇతరుల కష్టాలు పట్టించుకోము .. ప్రక్కవారి జోలికి వెళ్ళము . మనం మాత్రం సుఖంగా వుంటే చాలు .. డబ్బు అనేది మన అవసరాలు తీర్చడానికి వుపయోగించబడే ఒక ఆయుధం మాత్రమే .. ఎంత సంపాదించినా , ఐదు నక్షత్రాల హోటళ్ళలో భోజనాలు చేసినా ముఖ్యమైన్ వస్తువులు మూడు ,నాలుగే  --ఉప్పు,తీపి , కారం ,పులుపు ...ఎంత ధనవంతుడైనా ఈ కాంబినేషన్ లేకపోతె భోజనం సహించదు .. ఎంత  అందంగా ఆహారాన్ని మన ముందు ఉంచినా ఇవి లేకపోతె మనం తినలేము .. అలానే ఎంత సంపాదించినా సమయానికి ఆహారం , నిద్ర వుంటే చాలు .. కానీ, సంపాదనలో ,డబ్బు యావలో పది మానవ విలువలు ,సంబంధాలూ చెడిపోతున్నాయి .. బంధుత్వం కన్నా డబ్బు ముఖ్యం, డబ్బు వుంటే బంధుత్వాలు అవే దగ్గరకి వస్తాయి అనేవాళ్ళని చాలామందిని చూసాను . వారికి నచ్చ చెప్పుకునే కన్నా కాలం నేర్పే పాఠాలకి వారిని వదిలేయడమే మందు ,. అనుభవమే పాఠాలు నేర్పుతుంది .. కాని ,అప్పటికి ఒక జీవితకాలం ముగిసిపోతుంది .. అందుకే అనేది -భగవంతుడిచ్చిన ఈ జీవితానికి సార్ధకత చేకూర్చే ప్రయత్నం లో వుంటే మేలు అని