1, అక్టోబర్ 2015, గురువారం

సామాన్యులమే

అయ్యో .......


పాపం ఎవరిదీ? ఆడుతూ పాడుతూ వుండే వయసులో పెను తుఫాను దాటికి చిన్న శరీరం తట్టుకోలేక కాలవలో పడిపోయిన చిన్నారి ఆదితి

దా ?  స్వచ్చ భారత్ ,స్మార్ట్ సిటీ అంటూనే విశాఖ ను మురికిగా తయారు చేసిన పెద్దలదా ? సమస్య మొదలు కాక ముందు చర్యలు తీసుకోగల

సామర్ధ్యం లేకనా ? ఒక చిన్న వుదాహరణ -- న్యూస్ పేపర్ల లో ప్రకటనలు వెలువడుతూ వుంటాయి ఎన్నో .. అవి ఫేక్ అని తెలిసి కూడా చిట్లు

కట్టి మోసపోతున్న వాళ్ళు ఎందఱో .. అయినా కడుతూనే వుంటారు . మోసపోతూనే వుంటారు .. పోలీస్ కంప్లైంట్స్ ఇస్తూనే వుంటారు ..

ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే వుంటారు .. పని జరగదు .. చివరకు జీవితాంతం తలచుకుంటూ వుసూరుమంటూ వుంటారు .. ఇది సర్వ

సామాన్యం ఐపోయింది .. మనం సామాన్యులమే కదా ..              

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

నిజంగా ఇది శోచనీయమే .. ప్రక్కవాళ్ళని  నిందించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు .. తమని తాము

ప్రశాంతంగా వుంచుకోగలిగే విధానం తెలియక.. తెలియనితనంతో ప్రక్కవాళ్ళ కెలుకుతూ వాళ్ళ ప్రశాంతతని

 పోగొట్టడంలో పాండిత్యం సంపాదించుకుంటారు కాని  తాము ఏమి కోల్పోతున్నారో తెలుసుకోలేరు .. కొందరు తమని
తాము తెలుసుకోలేక ఎదుటి వారి దృష్టిలో ప్రత్యేకత పొందడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు .. 'నిండుకుండ
తొణకదు ' అన్న నానుడి వర్తింప జేసుకుంటూ నేమ్మదితనంతో వుండేవాళ్ళ ని చాతకాని వాళ్ళలా భావించే వారు ఎందఱో ...   

19, సెప్టెంబర్ 2015, శనివారం

కంచే చేను మేస్తే ?

కంచే చేను మేస్తే ?
పరమాత్ముని బిడ్డలు పరమాత్ములే.....
మన కంటికి కనబడని ఆ పరమాత్మునిలో తల్లి ,తండ్రి ,గురువు, స్నేహితుడు ఇన్ని రకాల బాంధవ్యాలు ఆశించుతాము ..    అదే విధంగా ఆ పరమాత్ముని బిడ్డలమైన మనలో కూడా ఆ బాంధవ్యాలు అన్నీ వుంటాయి .. అంటే ఆ బాంధవ్యాల తాలూకు ప్రేమాభిమానాలు తప్ప ద్వేష ,విద్వేషాలు వుండకూడదు...  ఎందుకంటే కనిపించని ఆ పరమాత్ముడు మనల్ని కష్టాలనుండి ,మనస్తాపాల నుండి కాపాడుతాడు తప్ప మనల్ని ద్వేషించడు. భక్షించడు .
. మరి మనమెందుకు వికృత చేష్టలన్నీ చేస్తున్నాము ? మనలో ప్రేమాభిమానాలు తప్ప వేరే భావాలు ఉండకూడదు కదా .. మరి ఎందుకు ఒకరినొకరం చంపుకుంటున్నాము   ? 

9, సెప్టెంబర్ 2015, బుధవారం

మార్పు కావాలి ? ఈ తరం వారు ,ఇక్కడ నేను పిల్లలా లేక పెద్దలా అని ప్రస్తావించడం లేదు .. ఇరువురినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ..     "we want some change. we need some change." ఈ భావన అందరిలోనూ కనిపిస్తుంది .. కాలం ప్రభావం , మీడియా ప్రభావం ,ఒత్తిడి ప్రభావం , న్యూక్లియర్ కుటుంబాల ప్రభావం వీటన్నింటిలో ఏదైనా ఒక కారణం కావచ్చు లేదా అన్నీ కావచ్చు .. మనసుల మీద ఆ ప్రభావం వుంటుంది అని చాలా క్లియర్ గా తెలుస్తుంది.. కాని ఒక్క
మాటలో కాదు ఆ ప్రభావం మన మీద ఎన్నో విధాలుగా కనబడుతుంది .. మన ఆలొచనా రీతి మారుతుంది ..
తరానికి తగ్గట్టుగా ఆహార విహారాదుల మీదకి దృష్టి మళ్ళుతుంది .. ఫలితం - మనకి కావలసిన మార్పు మనల్ని
 ప్రక్క దారిలోనికి మల్లిస్తుంది ... శరీరం ఆరోగ్యకరంగా కనబడక పోగా ఊబకాయానికి , తద్వారా మనలోని జీవక్రియల మీద ప్రభావం పడుతుంది .. ఈ ఒత్తిడి తట్టుకోలేనిది .. మన జీవనం ఇబ్బందిలో పడేది .. అందుకే
మార్పు కోరుకోవడం లో తప్పు లేదు ..
కొంచెం  ఆలోచించి ఆరోగ్యకరమైన మార్పును కోరుకోవలసిన భాద్యత మనదే ...    ..      .  

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

'ఆహా, ఏమి రుచి'  అంటూ మనం వుల్లిపాయ లేనిదే వంటలు వండలేము ,వుండలేము అన్న స్థితిలో వున్నాము..   అంత అడిక్షనా ?



పై పిక్చర్స్  చూసారు కదా .. నిజంగా రైతు బజార్లలో వుల్లిపాయలు కేజి ఇరవై రూపాయలు అనేసరికి ప్రజలు ఒకరిమీద ఒకరు ఎక్కి,ఒకరిని ఒకరు తొక్కుకుని మరీ  వీర వనితల్లా, యుద్దంలో ఘన విజయం సాధించిన యోదుల్లా పది రోజులు అదే చర్చ .. 
వుల్లిపాయల మీద జోక్స్ కూడా తక్కువ రాలేదు . whats app మెసేజెస్ లో ఉల్లిపాయల బస్తాల మీద కూర్చుని వున్న వ్యక్తిని శ్రీమంతుడు గాను, పేకాట పందేలలో డబ్బులకు బదులుగా ఉల్లిపాయలను ,వుంగరం లో రాయి కి బదులుగా ఉల్లిపాయను(అలంకారం ).. 
ఒక నాలుగు రోజులు ఉల్లిపాయ వాడకుండా, కొనకుండా వుంటే మన నిధులు మిగులుతాయని భయమా ? లేక చనిపోతామని భయమా ? దొరకని వస్తువు కోసం వెంపర్లాడడం , మనది కానిది దక్కించుకోవాలన్న ఆరాటం మనకి అలవాటు ఐపోయింది . అందుకే మనిషి వునికి కష్టతరంగా మారిపోయింది .. 
పెట్రోల్  ధర పెరిగిపోతుంది బాబోయ్ అనుకోకపోతే కొన్నిరోజులు ఎవరూ కొనకుండా  వుంటే ధరలు దిగి రావా ?
వుల్లిపాయలను వాడకుండా కొన్నిరోజులు ఉండగలిగితే ఎన్నిరోజులు లోపల దాచుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోగలరు ?
ఈ విషయాలు శోచనీయాలే కదా .......  












  

31, ఆగస్టు 2015, సోమవారం

శోచనీయం : గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ...

శోచనీయం : గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ...: గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ఏడుపు వినిపిస్తూ వుంది .. ముందు అయోమయం అనిపించింది .. తర్వాత శ్రద్దగా వింటే అది ఒక కుక్క ...
గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ఏడుపు వినిపిస్తూ వుంది .. ముందు అయోమయం అనిపించింది .. తర్వాత శ్రద్దగా వింటే అది ఒక కుక్క ఏడుపు అని అర్ధమైంది ..ఏదైనా జబ్బు చేసిందేమో, నేను కనీస ధర్మం కూడా చూపడం లేదు అని బాధ పడ్డాను (ఇది సెకండరీ ).. ఇది రాత్రి సమయంలోనే జరుగుతుంది .. అలానే రోజూ సరిగ్గా రాత్రి పదకొండు గంటల లోగా చాలా కుక్కలు చాలా దారుణంగా అరుపులు , వాటిలో అవి కొట్టుకోవడాలూ చేస్తున్నాయి .. ఎందుకు ఇలా అని అనిపించింది .. నాలుగైదు రోజుల తర్వాత నేను బయటకి వెళ్లి బాల్కనీ లో నిలబడి చూస్తె ,
                        ఒక ఆడకుక్క ,చుట్టూ పది పదిహేను మగకుక్కలు 
                        మావారు అన్నారు ఇది చిత్తకార్తె అని .. 

నిజమే . వాటికి సంవత్సరానికి ఒక్కసారే చిత్తకార్తె .. మరి మనకి ????
వెంటనే నాకు ఒక నిర్భయ కేసు , ఇంకా ఎన్నో రకాల సంఘటనలు మనసులో మెదిలాయి.. అప్పటినుండి మనసు వికలం ఐపోయింది .. .  తెలిసి ఎన్నో , తెలియక జరిగేవి లక్షల్లో ...

                 ఏమైనా తేడా వుంటే చెప్పండి 
గొల్లపూడి మారుతీరావు గారి ఆర్టికల్ ఒకటి ఈ మధ్యనే సాక్షి న్యూస్ పేపర్ లో చదివాను.. ఒక ఆడపిల్ల తన ముసుగు తీసి నిలబడింది అని .. ఇంకో ఆడపిల్ల ముసుగు కప్పుకుని వుంది .. అని  తన రెండు ముసుగుల  కధ లొ....చాలా అర్ధవంతమైన ఆర్టికల్ అది ...  ... ఈ సమాజం మనకి పరువు అంటూ ఒక దుప్పటి ముసుగు వేసింది .. సమాజం అంటే మనమే అంటే మనకి మనమే ముసుగులు వేసుకుని పడుకుంటూ రోజులు లేక్కపెట్టేస్తున్నాము అన్నమాట ........
                                             
    ఇది దారుణం ... ఈ స్థితి మనకి వద్దు ... 
                                                         



    
                                                           ఇదే కావాలి మనకి అంటే .. నా వుద్దేశ్యం గాలిలో ఎగరడం కాదు .. మన మువ్వన్నెల జండాలో ఎన్నో దాగున్నాయి .. కాని అది దుప్పటితో కప్పబడలేదు .. స్వేచ్చగా వుంది .. ప్రశాంతంగా ,హాయిగా .......... అన్నింటినీ మించి  నిర్మలంగా" .. అవే కావాలి మనకి ...