ఆంగ్ల నూతన సంవత్సరం ఐనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా జరుపుకునే ఉత్సవం .. అందరూ తమ తమ సంబందీకులతో ఆనందంగా గడిపే రోజు.. ఆ రోజు పాత స్మృతులు అన్నీ మరచిపోయి నూతన ఉత్సాహంతో వుంటారు .. తమ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాత విషయాలు ఏవీ మనసులోనికి రానీయకుండా మనస్పూర్తిగా ఇతరులని పలకరించి శుభాకాంక్షలు తెలియచేసే రోజు .. అందరికీ ఆనందకరమైన ఆ రోజుని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుదాము.
30, డిసెంబర్ 2015, బుధవారం
స్వాగతం మిత్రమా ............
ఆంగ్ల నూతన సంవత్సరం ఐనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా జరుపుకునే ఉత్సవం .. అందరూ తమ తమ సంబందీకులతో ఆనందంగా గడిపే రోజు.. ఆ రోజు పాత స్మృతులు అన్నీ మరచిపోయి నూతన ఉత్సాహంతో వుంటారు .. తమ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాత విషయాలు ఏవీ మనసులోనికి రానీయకుండా మనస్పూర్తిగా ఇతరులని పలకరించి శుభాకాంక్షలు తెలియచేసే రోజు .. అందరికీ ఆనందకరమైన ఆ రోజుని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుదాము.
28, అక్టోబర్ 2015, బుధవారం
పల్ దో పల్ కా
మై పల్ దో పల్ కా... ఎంతో అందమైన పాట ...పాట వ్రాయబడినది ఒక సినిమాలో హీరో కోసం ... తన గురించి వివరిస్తూ పాడే పాత .. కానీ ఎంతో అర్ధవంతమైన పాట . జీవితం ఏమిటో తెలిపే పాట .. అందుకే పోస్ట్ చేయడం జరిగింది
26, అక్టోబర్ 2015, సోమవారం
ఒకప్రక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు ప్రజలు .. కారణం -డబ్బు .. అత్యాశ ...
మరోప్రక్క భూ విలయాలకు అనాధలుగా మారుతున్నారు ,మృత్యువాతకి గురి అవుతున్నారు . ఇవన్నీ చూస్తూనే వున్నాము ప్రతిరోజూ .. అయినా నిమ్మకి నీరెత్తినట్లు మౌనంగా వుండిపోతున్నాము.. మన పనులు మనం చేసుకుంటూ వేల్లిపోతున్నాము .. మనం చాలా చాలా పెద్ద వైరాగ్యులము .. ఇతరుల కష్టాలు పట్టించుకోము .. ప్రక్కవారి జోలికి వెళ్ళము . మనం మాత్రం సుఖంగా వుంటే చాలు .. డబ్బు అనేది మన అవసరాలు తీర్చడానికి వుపయోగించబడే ఒక ఆయుధం మాత్రమే .. ఎంత సంపాదించినా , ఐదు నక్షత్రాల హోటళ్ళలో భోజనాలు చేసినా ముఖ్యమైన్ వస్తువులు మూడు ,నాలుగే --ఉప్పు,తీపి , కారం ,పులుపు ...ఎంత ధనవంతుడైనా ఈ కాంబినేషన్ లేకపోతె భోజనం సహించదు .. ఎంత అందంగా ఆహారాన్ని మన ముందు ఉంచినా ఇవి లేకపోతె మనం తినలేము .. అలానే ఎంత సంపాదించినా సమయానికి ఆహారం , నిద్ర వుంటే చాలు .. కానీ, సంపాదనలో ,డబ్బు యావలో పది మానవ విలువలు ,సంబంధాలూ చెడిపోతున్నాయి .. బంధుత్వం కన్నా డబ్బు ముఖ్యం, డబ్బు వుంటే బంధుత్వాలు అవే దగ్గరకి వస్తాయి అనేవాళ్ళని చాలామందిని చూసాను . వారికి నచ్చ చెప్పుకునే కన్నా కాలం నేర్పే పాఠాలకి వారిని వదిలేయడమే మందు ,. అనుభవమే పాఠాలు నేర్పుతుంది .. కాని ,అప్పటికి ఒక జీవితకాలం ముగిసిపోతుంది .. అందుకే అనేది -భగవంతుడిచ్చిన ఈ జీవితానికి సార్ధకత చేకూర్చే ప్రయత్నం లో వుంటే మేలు అని
1, అక్టోబర్ 2015, గురువారం
సామాన్యులమే
20, సెప్టెంబర్ 2015, ఆదివారం
నిజంగా ఇది శోచనీయమే .. ప్రక్కవాళ్ళని నిందించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు .. తమని తాము
ప్రశాంతంగా వుంచుకోగలిగే విధానం తెలియక.. తెలియనితనంతో ప్రక్కవాళ్ళ కెలుకుతూ వాళ్ళ ప్రశాంతతని
పోగొట్టడంలో పాండిత్యం సంపాదించుకుంటారు కాని తాము ఏమి కోల్పోతున్నారో తెలుసుకోలేరు .. కొందరు తమని
తాము తెలుసుకోలేక ఎదుటి వారి దృష్టిలో ప్రత్యేకత పొందడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు .. 'నిండుకుండ
తొణకదు ' అన్న నానుడి వర్తింప జేసుకుంటూ నేమ్మదితనంతో వుండేవాళ్ళ ని చాతకాని వాళ్ళలా భావించే వారు ఎందఱో ...

19, సెప్టెంబర్ 2015, శనివారం
కంచే చేను మేస్తే ?
కంచే చేను మేస్తే ?
పరమాత్ముని బిడ్డలు పరమాత్ములే.....
మన కంటికి కనబడని ఆ పరమాత్మునిలో తల్లి ,తండ్రి ,గురువు, స్నేహితుడు ఇన్ని రకాల బాంధవ్యాలు ఆశించుతాము .. అదే విధంగా ఆ పరమాత్ముని బిడ్డలమైన మనలో కూడా ఆ బాంధవ్యాలు అన్నీ వుంటాయి .. అంటే ఆ బాంధవ్యాల తాలూకు ప్రేమాభిమానాలు తప్ప ద్వేష ,విద్వేషాలు వుండకూడదు... ఎందుకంటే కనిపించని ఆ పరమాత్ముడు మనల్ని కష్టాలనుండి ,మనస్తాపాల నుండి కాపాడుతాడు తప్ప మనల్ని ద్వేషించడు. భక్షించడు .
. మరి మనమెందుకు వికృత చేష్టలన్నీ చేస్తున్నాము ? మనలో ప్రేమాభిమానాలు తప్ప వేరే భావాలు ఉండకూడదు కదా .. మరి ఎందుకు ఒకరినొకరం చంపుకుంటున్నాము ?

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)