20, సెప్టెంబర్ 2015, ఆదివారం

నిజంగా ఇది శోచనీయమే .. ప్రక్కవాళ్ళని  నిందించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు .. తమని తాము

ప్రశాంతంగా వుంచుకోగలిగే విధానం తెలియక.. తెలియనితనంతో ప్రక్కవాళ్ళ కెలుకుతూ వాళ్ళ ప్రశాంతతని

 పోగొట్టడంలో పాండిత్యం సంపాదించుకుంటారు కాని  తాము ఏమి కోల్పోతున్నారో తెలుసుకోలేరు .. కొందరు తమని
తాము తెలుసుకోలేక ఎదుటి వారి దృష్టిలో ప్రత్యేకత పొందడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు .. 'నిండుకుండ
తొణకదు ' అన్న నానుడి వర్తింప జేసుకుంటూ నేమ్మదితనంతో వుండేవాళ్ళ ని చాతకాని వాళ్ళలా భావించే వారు ఎందఱో ...   

19, సెప్టెంబర్ 2015, శనివారం

కంచే చేను మేస్తే ?

కంచే చేను మేస్తే ?
పరమాత్ముని బిడ్డలు పరమాత్ములే.....
మన కంటికి కనబడని ఆ పరమాత్మునిలో తల్లి ,తండ్రి ,గురువు, స్నేహితుడు ఇన్ని రకాల బాంధవ్యాలు ఆశించుతాము ..    అదే విధంగా ఆ పరమాత్ముని బిడ్డలమైన మనలో కూడా ఆ బాంధవ్యాలు అన్నీ వుంటాయి .. అంటే ఆ బాంధవ్యాల తాలూకు ప్రేమాభిమానాలు తప్ప ద్వేష ,విద్వేషాలు వుండకూడదు...  ఎందుకంటే కనిపించని ఆ పరమాత్ముడు మనల్ని కష్టాలనుండి ,మనస్తాపాల నుండి కాపాడుతాడు తప్ప మనల్ని ద్వేషించడు. భక్షించడు .
. మరి మనమెందుకు వికృత చేష్టలన్నీ చేస్తున్నాము ? మనలో ప్రేమాభిమానాలు తప్ప వేరే భావాలు ఉండకూడదు కదా .. మరి ఎందుకు ఒకరినొకరం చంపుకుంటున్నాము   ? 

9, సెప్టెంబర్ 2015, బుధవారం

మార్పు కావాలి ? ఈ తరం వారు ,ఇక్కడ నేను పిల్లలా లేక పెద్దలా అని ప్రస్తావించడం లేదు .. ఇరువురినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ..     "we want some change. we need some change." ఈ భావన అందరిలోనూ కనిపిస్తుంది .. కాలం ప్రభావం , మీడియా ప్రభావం ,ఒత్తిడి ప్రభావం , న్యూక్లియర్ కుటుంబాల ప్రభావం వీటన్నింటిలో ఏదైనా ఒక కారణం కావచ్చు లేదా అన్నీ కావచ్చు .. మనసుల మీద ఆ ప్రభావం వుంటుంది అని చాలా క్లియర్ గా తెలుస్తుంది.. కాని ఒక్క
మాటలో కాదు ఆ ప్రభావం మన మీద ఎన్నో విధాలుగా కనబడుతుంది .. మన ఆలొచనా రీతి మారుతుంది ..
తరానికి తగ్గట్టుగా ఆహార విహారాదుల మీదకి దృష్టి మళ్ళుతుంది .. ఫలితం - మనకి కావలసిన మార్పు మనల్ని
 ప్రక్క దారిలోనికి మల్లిస్తుంది ... శరీరం ఆరోగ్యకరంగా కనబడక పోగా ఊబకాయానికి , తద్వారా మనలోని జీవక్రియల మీద ప్రభావం పడుతుంది .. ఈ ఒత్తిడి తట్టుకోలేనిది .. మన జీవనం ఇబ్బందిలో పడేది .. అందుకే
మార్పు కోరుకోవడం లో తప్పు లేదు ..
కొంచెం  ఆలోచించి ఆరోగ్యకరమైన మార్పును కోరుకోవలసిన భాద్యత మనదే ...    ..      .  

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

'ఆహా, ఏమి రుచి'  అంటూ మనం వుల్లిపాయ లేనిదే వంటలు వండలేము ,వుండలేము అన్న స్థితిలో వున్నాము..   అంత అడిక్షనా ?



పై పిక్చర్స్  చూసారు కదా .. నిజంగా రైతు బజార్లలో వుల్లిపాయలు కేజి ఇరవై రూపాయలు అనేసరికి ప్రజలు ఒకరిమీద ఒకరు ఎక్కి,ఒకరిని ఒకరు తొక్కుకుని మరీ  వీర వనితల్లా, యుద్దంలో ఘన విజయం సాధించిన యోదుల్లా పది రోజులు అదే చర్చ .. 
వుల్లిపాయల మీద జోక్స్ కూడా తక్కువ రాలేదు . whats app మెసేజెస్ లో ఉల్లిపాయల బస్తాల మీద కూర్చుని వున్న వ్యక్తిని శ్రీమంతుడు గాను, పేకాట పందేలలో డబ్బులకు బదులుగా ఉల్లిపాయలను ,వుంగరం లో రాయి కి బదులుగా ఉల్లిపాయను(అలంకారం ).. 
ఒక నాలుగు రోజులు ఉల్లిపాయ వాడకుండా, కొనకుండా వుంటే మన నిధులు మిగులుతాయని భయమా ? లేక చనిపోతామని భయమా ? దొరకని వస్తువు కోసం వెంపర్లాడడం , మనది కానిది దక్కించుకోవాలన్న ఆరాటం మనకి అలవాటు ఐపోయింది . అందుకే మనిషి వునికి కష్టతరంగా మారిపోయింది .. 
పెట్రోల్  ధర పెరిగిపోతుంది బాబోయ్ అనుకోకపోతే కొన్నిరోజులు ఎవరూ కొనకుండా  వుంటే ధరలు దిగి రావా ?
వుల్లిపాయలను వాడకుండా కొన్నిరోజులు ఉండగలిగితే ఎన్నిరోజులు లోపల దాచుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోగలరు ?
ఈ విషయాలు శోచనీయాలే కదా .......