30, డిసెంబర్ 2015, బుధవారం

స్వాగతం మిత్రమా ............





ఆంగ్ల నూతన సంవత్సరం ఐనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా జరుపుకునే ఉత్సవం .. అందరూ తమ తమ సంబందీకులతో ఆనందంగా గడిపే రోజు.. ఆ రోజు పాత స్మృతులు అన్నీ మరచిపోయి నూతన ఉత్సాహంతో వుంటారు .. తమ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పాత విషయాలు ఏవీ మనసులోనికి రానీయకుండా మనస్పూర్తిగా ఇతరులని పలకరించి శుభాకాంక్షలు తెలియచేసే రోజు .. అందరికీ ఆనందకరమైన ఆ రోజుని హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుదాము.  

28, అక్టోబర్ 2015, బుధవారం

పల్ దో పల్ కా

మై పల్ దో  పల్ కా... ఎంతో  అందమైన పాట ...పాట వ్రాయబడినది ఒక సినిమాలో హీరో కోసం ... తన గురించి వివరిస్తూ పాడే పాత .. కానీ ఎంతో అర్ధవంతమైన పాట . జీవితం ఏమిటో తెలిపే పాట .. అందుకే పోస్ట్ చేయడం జరిగింది     

Main Pal Do Pal Ka Shayar Hoon (Eng Sub) [Full Video Song] (HD) With Lyr...

26, అక్టోబర్ 2015, సోమవారం

భూమి మనకు నివాసయోగ్యం .. మన కన్నతల్లి . మనకి నీరు , ఆహారం, అన్ని విధాలా మనల్ని సుఖజీవనం గడిపేలా సకల సంపదలూ మన నోటికి అందిస్తున్న తల్లి . అటువంటి తల్లికి మన మీద ఎందుకు కోపం ?
ఒకప్రక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు ప్రజలు .. కారణం -డబ్బు .. అత్యాశ ...
మరోప్రక్క భూ విలయాలకు అనాధలుగా మారుతున్నారు ,మృత్యువాతకి గురి అవుతున్నారు . ఇవన్నీ చూస్తూనే వున్నాము ప్రతిరోజూ .. అయినా నిమ్మకి నీరెత్తినట్లు మౌనంగా వుండిపోతున్నాము.. మన పనులు మనం చేసుకుంటూ వేల్లిపోతున్నాము .. మనం చాలా చాలా పెద్ద వైరాగ్యులము .. ఇతరుల కష్టాలు పట్టించుకోము .. ప్రక్కవారి జోలికి వెళ్ళము . మనం మాత్రం సుఖంగా వుంటే చాలు .. డబ్బు అనేది మన అవసరాలు తీర్చడానికి వుపయోగించబడే ఒక ఆయుధం మాత్రమే .. ఎంత సంపాదించినా , ఐదు నక్షత్రాల హోటళ్ళలో భోజనాలు చేసినా ముఖ్యమైన్ వస్తువులు మూడు ,నాలుగే  --ఉప్పు,తీపి , కారం ,పులుపు ...ఎంత ధనవంతుడైనా ఈ కాంబినేషన్ లేకపోతె భోజనం సహించదు .. ఎంత  అందంగా ఆహారాన్ని మన ముందు ఉంచినా ఇవి లేకపోతె మనం తినలేము .. అలానే ఎంత సంపాదించినా సమయానికి ఆహారం , నిద్ర వుంటే చాలు .. కానీ, సంపాదనలో ,డబ్బు యావలో పది మానవ విలువలు ,సంబంధాలూ చెడిపోతున్నాయి .. బంధుత్వం కన్నా డబ్బు ముఖ్యం, డబ్బు వుంటే బంధుత్వాలు అవే దగ్గరకి వస్తాయి అనేవాళ్ళని చాలామందిని చూసాను . వారికి నచ్చ చెప్పుకునే కన్నా కాలం నేర్పే పాఠాలకి వారిని వదిలేయడమే మందు ,. అనుభవమే పాఠాలు నేర్పుతుంది .. కాని ,అప్పటికి ఒక జీవితకాలం ముగిసిపోతుంది .. అందుకే అనేది -భగవంతుడిచ్చిన ఈ జీవితానికి సార్ధకత చేకూర్చే ప్రయత్నం లో వుంటే మేలు అని                

1, అక్టోబర్ 2015, గురువారం

సామాన్యులమే

అయ్యో .......


పాపం ఎవరిదీ? ఆడుతూ పాడుతూ వుండే వయసులో పెను తుఫాను దాటికి చిన్న శరీరం తట్టుకోలేక కాలవలో పడిపోయిన చిన్నారి ఆదితి

దా ?  స్వచ్చ భారత్ ,స్మార్ట్ సిటీ అంటూనే విశాఖ ను మురికిగా తయారు చేసిన పెద్దలదా ? సమస్య మొదలు కాక ముందు చర్యలు తీసుకోగల

సామర్ధ్యం లేకనా ? ఒక చిన్న వుదాహరణ -- న్యూస్ పేపర్ల లో ప్రకటనలు వెలువడుతూ వుంటాయి ఎన్నో .. అవి ఫేక్ అని తెలిసి కూడా చిట్లు

కట్టి మోసపోతున్న వాళ్ళు ఎందఱో .. అయినా కడుతూనే వుంటారు . మోసపోతూనే వుంటారు .. పోలీస్ కంప్లైంట్స్ ఇస్తూనే వుంటారు ..

ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే వుంటారు .. పని జరగదు .. చివరకు జీవితాంతం తలచుకుంటూ వుసూరుమంటూ వుంటారు .. ఇది సర్వ

సామాన్యం ఐపోయింది .. మనం సామాన్యులమే కదా ..              

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

నిజంగా ఇది శోచనీయమే .. ప్రక్కవాళ్ళని  నిందించడమే పనిగా పెట్టుకుంటారు కొందరు .. తమని తాము

ప్రశాంతంగా వుంచుకోగలిగే విధానం తెలియక.. తెలియనితనంతో ప్రక్కవాళ్ళ కెలుకుతూ వాళ్ళ ప్రశాంతతని

 పోగొట్టడంలో పాండిత్యం సంపాదించుకుంటారు కాని  తాము ఏమి కోల్పోతున్నారో తెలుసుకోలేరు .. కొందరు తమని
తాము తెలుసుకోలేక ఎదుటి వారి దృష్టిలో ప్రత్యేకత పొందడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు .. 'నిండుకుండ
తొణకదు ' అన్న నానుడి వర్తింప జేసుకుంటూ నేమ్మదితనంతో వుండేవాళ్ళ ని చాతకాని వాళ్ళలా భావించే వారు ఎందఱో ...   

19, సెప్టెంబర్ 2015, శనివారం

కంచే చేను మేస్తే ?

కంచే చేను మేస్తే ?
పరమాత్ముని బిడ్డలు పరమాత్ములే.....
మన కంటికి కనబడని ఆ పరమాత్మునిలో తల్లి ,తండ్రి ,గురువు, స్నేహితుడు ఇన్ని రకాల బాంధవ్యాలు ఆశించుతాము ..    అదే విధంగా ఆ పరమాత్ముని బిడ్డలమైన మనలో కూడా ఆ బాంధవ్యాలు అన్నీ వుంటాయి .. అంటే ఆ బాంధవ్యాల తాలూకు ప్రేమాభిమానాలు తప్ప ద్వేష ,విద్వేషాలు వుండకూడదు...  ఎందుకంటే కనిపించని ఆ పరమాత్ముడు మనల్ని కష్టాలనుండి ,మనస్తాపాల నుండి కాపాడుతాడు తప్ప మనల్ని ద్వేషించడు. భక్షించడు .
. మరి మనమెందుకు వికృత చేష్టలన్నీ చేస్తున్నాము ? మనలో ప్రేమాభిమానాలు తప్ప వేరే భావాలు ఉండకూడదు కదా .. మరి ఎందుకు ఒకరినొకరం చంపుకుంటున్నాము   ? 

9, సెప్టెంబర్ 2015, బుధవారం

మార్పు కావాలి ? ఈ తరం వారు ,ఇక్కడ నేను పిల్లలా లేక పెద్దలా అని ప్రస్తావించడం లేదు .. ఇరువురినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ..     "we want some change. we need some change." ఈ భావన అందరిలోనూ కనిపిస్తుంది .. కాలం ప్రభావం , మీడియా ప్రభావం ,ఒత్తిడి ప్రభావం , న్యూక్లియర్ కుటుంబాల ప్రభావం వీటన్నింటిలో ఏదైనా ఒక కారణం కావచ్చు లేదా అన్నీ కావచ్చు .. మనసుల మీద ఆ ప్రభావం వుంటుంది అని చాలా క్లియర్ గా తెలుస్తుంది.. కాని ఒక్క
మాటలో కాదు ఆ ప్రభావం మన మీద ఎన్నో విధాలుగా కనబడుతుంది .. మన ఆలొచనా రీతి మారుతుంది ..
తరానికి తగ్గట్టుగా ఆహార విహారాదుల మీదకి దృష్టి మళ్ళుతుంది .. ఫలితం - మనకి కావలసిన మార్పు మనల్ని
 ప్రక్క దారిలోనికి మల్లిస్తుంది ... శరీరం ఆరోగ్యకరంగా కనబడక పోగా ఊబకాయానికి , తద్వారా మనలోని జీవక్రియల మీద ప్రభావం పడుతుంది .. ఈ ఒత్తిడి తట్టుకోలేనిది .. మన జీవనం ఇబ్బందిలో పడేది .. అందుకే
మార్పు కోరుకోవడం లో తప్పు లేదు ..
కొంచెం  ఆలోచించి ఆరోగ్యకరమైన మార్పును కోరుకోవలసిన భాద్యత మనదే ...    ..      .  

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

'ఆహా, ఏమి రుచి'  అంటూ మనం వుల్లిపాయ లేనిదే వంటలు వండలేము ,వుండలేము అన్న స్థితిలో వున్నాము..   అంత అడిక్షనా ?



పై పిక్చర్స్  చూసారు కదా .. నిజంగా రైతు బజార్లలో వుల్లిపాయలు కేజి ఇరవై రూపాయలు అనేసరికి ప్రజలు ఒకరిమీద ఒకరు ఎక్కి,ఒకరిని ఒకరు తొక్కుకుని మరీ  వీర వనితల్లా, యుద్దంలో ఘన విజయం సాధించిన యోదుల్లా పది రోజులు అదే చర్చ .. 
వుల్లిపాయల మీద జోక్స్ కూడా తక్కువ రాలేదు . whats app మెసేజెస్ లో ఉల్లిపాయల బస్తాల మీద కూర్చుని వున్న వ్యక్తిని శ్రీమంతుడు గాను, పేకాట పందేలలో డబ్బులకు బదులుగా ఉల్లిపాయలను ,వుంగరం లో రాయి కి బదులుగా ఉల్లిపాయను(అలంకారం ).. 
ఒక నాలుగు రోజులు ఉల్లిపాయ వాడకుండా, కొనకుండా వుంటే మన నిధులు మిగులుతాయని భయమా ? లేక చనిపోతామని భయమా ? దొరకని వస్తువు కోసం వెంపర్లాడడం , మనది కానిది దక్కించుకోవాలన్న ఆరాటం మనకి అలవాటు ఐపోయింది . అందుకే మనిషి వునికి కష్టతరంగా మారిపోయింది .. 
పెట్రోల్  ధర పెరిగిపోతుంది బాబోయ్ అనుకోకపోతే కొన్నిరోజులు ఎవరూ కొనకుండా  వుంటే ధరలు దిగి రావా ?
వుల్లిపాయలను వాడకుండా కొన్నిరోజులు ఉండగలిగితే ఎన్నిరోజులు లోపల దాచుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోగలరు ?
ఈ విషయాలు శోచనీయాలే కదా .......  












  

31, ఆగస్టు 2015, సోమవారం

శోచనీయం : గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ...

శోచనీయం : గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ...: గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ఏడుపు వినిపిస్తూ వుంది .. ముందు అయోమయం అనిపించింది .. తర్వాత శ్రద్దగా వింటే అది ఒక కుక్క ...
గత కొన్ని రోజుల నుండి రోజూ ఓ..  ఓ..   ఓ..  అని ఒక ఏడుపు వినిపిస్తూ వుంది .. ముందు అయోమయం అనిపించింది .. తర్వాత శ్రద్దగా వింటే అది ఒక కుక్క ఏడుపు అని అర్ధమైంది ..ఏదైనా జబ్బు చేసిందేమో, నేను కనీస ధర్మం కూడా చూపడం లేదు అని బాధ పడ్డాను (ఇది సెకండరీ ).. ఇది రాత్రి సమయంలోనే జరుగుతుంది .. అలానే రోజూ సరిగ్గా రాత్రి పదకొండు గంటల లోగా చాలా కుక్కలు చాలా దారుణంగా అరుపులు , వాటిలో అవి కొట్టుకోవడాలూ చేస్తున్నాయి .. ఎందుకు ఇలా అని అనిపించింది .. నాలుగైదు రోజుల తర్వాత నేను బయటకి వెళ్లి బాల్కనీ లో నిలబడి చూస్తె ,
                        ఒక ఆడకుక్క ,చుట్టూ పది పదిహేను మగకుక్కలు 
                        మావారు అన్నారు ఇది చిత్తకార్తె అని .. 

నిజమే . వాటికి సంవత్సరానికి ఒక్కసారే చిత్తకార్తె .. మరి మనకి ????
వెంటనే నాకు ఒక నిర్భయ కేసు , ఇంకా ఎన్నో రకాల సంఘటనలు మనసులో మెదిలాయి.. అప్పటినుండి మనసు వికలం ఐపోయింది .. .  తెలిసి ఎన్నో , తెలియక జరిగేవి లక్షల్లో ...

                 ఏమైనా తేడా వుంటే చెప్పండి 
గొల్లపూడి మారుతీరావు గారి ఆర్టికల్ ఒకటి ఈ మధ్యనే సాక్షి న్యూస్ పేపర్ లో చదివాను.. ఒక ఆడపిల్ల తన ముసుగు తీసి నిలబడింది అని .. ఇంకో ఆడపిల్ల ముసుగు కప్పుకుని వుంది .. అని  తన రెండు ముసుగుల  కధ లొ....చాలా అర్ధవంతమైన ఆర్టికల్ అది ...  ... ఈ సమాజం మనకి పరువు అంటూ ఒక దుప్పటి ముసుగు వేసింది .. సమాజం అంటే మనమే అంటే మనకి మనమే ముసుగులు వేసుకుని పడుకుంటూ రోజులు లేక్కపెట్టేస్తున్నాము అన్నమాట ........
                                             
    ఇది దారుణం ... ఈ స్థితి మనకి వద్దు ... 
                                                         



    
                                                           ఇదే కావాలి మనకి అంటే .. నా వుద్దేశ్యం గాలిలో ఎగరడం కాదు .. మన మువ్వన్నెల జండాలో ఎన్నో దాగున్నాయి .. కాని అది దుప్పటితో కప్పబడలేదు .. స్వేచ్చగా వుంది .. ప్రశాంతంగా ,హాయిగా .......... అన్నింటినీ మించి  నిర్మలంగా" .. అవే కావాలి మనకి ...











12, ఆగస్టు 2015, బుధవారం

"వ్యక్తిని చూడగానే వ్యక్తిత్వం అంచనా వేయకూడదు .. ఎవరినీ మనం జడ్జ్ చెయలెము. ఎవరినీ మనం శాసించలెము .. తెలిసి కూడా పైవన్నీ చేసేస్తుంటాము . మనమే కరెక్ట్ అనుకుని సంతోషపడిపోతుంటాము. ఒప్పుకోము ఇతరులని . ఒప్పుకోము మనలని మనమే ఒకోసారి .. అనుకునేది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఇంకొకటి,,అన్నింటికీ మనమే కర్తలము  అనుకుంటాము ..అన్నింటికీ సమర్దులమే .. " 

27, జులై 2015, సోమవారం

తెల్లవారు ఝామున ,బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేచి ....... ?
లేస్తే ? చాలా చాలా మంచిది .. ఇది అందరికీ తెలిసిన విషయమే . మరల మరల తెలుస్తున్న విషయమే .. కొన్ని విషయాలు అంతే .. ప్రతి సారీ క్రొత్తగా తెలుస్తూనే వుంటాయి .. సూర్యోదయం , సూర్యాస్తమయం బట్టి మన పగలు ఏం  చేయాలి, ఏం చేయకూడదు ,రాత్రులు ఏం చేయాలి , ఏం చేయకూడదు అన్న నియమాల్ని పెద్దలు{పూర్వీకులు } వివరించారు .. ఆరోజుల్లో నిష్టగా ,నియమంగా ఆచరించారు ,ఆచరించి చూపారు తరువాతి తరాలకు. అనుభవజ్ఞుల్ని తేలికగా చూడకూడదు . ఇప్పుడు జరుగుతున్నది అదే ......
సూర్యోదయానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజ చేసుకోవాలి లేదా ధ్యానం చేసుకోవాలి లేదా వ్యాయామం చేసుకోవాలి అనేది ఒక నియమం .. కారణం నిద్రలో ముందురోజుకి సంబంధించిన సంఘటనల ప్రభావం తాలూకు కలలు ,వాటిద్వారా కలిగే  మానసిక అలజడులు మరుసటిరోజుకి కొనసాగకుండా ఆరోజు ప్రశాంతంగా గడవాలి .. ఒక విషయం గమనించాలి .-- మనసుకి , శరీరానికీ అవినాభావ సంబంధం  వుంది .. మన బ్లాగర్ ఉమాదేవి గారు అనుకుంటా జ్యోతి గారు అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం పంపారు - శరీరానికి జ్వరం వచ్చింది . మనసు విలవిలలాడింది . మంచి వాఖ్య .. ఈ సూర్యోదయాన నిద్రలేవడం వల్ల ఆ సమయంలో ఎటువంటి రణగొణ ద్వనులు వుండవు . వాతావరణం ఒకరకమైన ప్రశాంత స్థితిలో వుంటుంది . చల్లటి గాలులు వీస్తాయి. మనకి అవసరమైన ఆక్సిజెన్ సరఫరా కాలుష్యం లేకుండా వుంటుంది .. ఇంత మంచి స్థితి మనం అనుభవిస్తే మనసు ,శరీరం ఒక రకమైన తేలిక భావనతో , ప్రశాంతంగా తదుపరి ఎంతటి పని అయినా చేయడానికి సిద్ధపడిపోతుంది ... ఫలితం మంచిగా వుంటుంది .. అందుకే విద్యార్ధులని కూడా తెల్లవారు ఝామున చదువుకోమని చెప్తూ వుంటాము ..

ఇక నా ఆలోచన ఏమిటంటే పూర్వపు రోజుల్లో స్కూల్ పని వేళలు  చాలా లీజర్  గా   అంటే పది గంటల సమయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమె వుండేవి .. ఆనాడు తెలివితేటలు కలిగిన , అధికారాల్లోనికి వచ్చిన విద్యార్ధులు లేరా ? 
ఒత్తిడి అన్న మాట అప్పుడు వుండేదా ? ఆరోజుల్లో ప్రజలు హాయిగా లేరా ?
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈనాటి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అన్నది గృహిణులు నోట్లో నీరు కూడా పోసుకోలేనంతగా హడావిడిగా వంటగదిలోనికి పరుగులు పెట్టేంత స్థితికి దిగజార్చింది ..తెల్లవారి   నాలుగు లేదా ఐదు  గంటల నుండి ఇంటిలోని వారు వారి వారి పనులమీద బయటకి వెళ్ళేంతవరకూ వురుకులూ , పరుగులూ... ఆ తర్వాత నెమ్మదిగా తన బ్రష్ ,స్నానం , ఉపహారం ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు .. ఇది ఒత్తిడి కాదా .. ఇది మన ప్రాచీన నియమాన్ని ఉల్లంగించడం కాదా ? ఇక ఆరోగ్యం ఎక్కడినుండి వస్తుంది చెప్పండి .
గృహిణి ,హౌస్ వైఫ్ నుండి హోం మేకర్ గా పదం మారింది .. కరెక్టే .. కానీ స్థితి మారలేదు .. ఇల్లాలు ఆరోగ్యంగా వుంటే ఇల్లు బాగుంటుంది .. ఇల్లు బాగుంటే ఇంటిలో నివాసం వున్నవారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలకాలం వర్ధిల్లుతాయి .. అంతేతప్ప అసలు మూలం వదిలేసి కొంచెం తేడా చేసినా గుడులకీ ,గోపురాలకీ పరుగులు పెట్టడం అవసరమా ?
కొసమెరుపు : ఎవరికొ ఒంట్లో బాగోలేదు .. డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మానేసి ఇంకెవరి దగ్గరకో పరుగులు తీసారట చేతబడులు చేసారు అందుకే ఆరోగ్యం పాడయింది అని.. ఆశ్చర్యం అనిపించింది .. మన అనారోగ్యం మన విధి విధానాల బట్టే కదా .. బాగున్నా , పాడినా మనకి  మనమే కారణం .. కాదా     


       










         .    

26, జులై 2015, ఆదివారం

మహాపాపం

ఆత్మహత్య మహాపాపం ... ఈ వాక్యం మనం నిత్యం ఎక్కడో అక్కడ చదువుతూనే వుంటాం ..అవును కదా అని అనుకుంటూనే వుంటాము ..  కానీ ఆ పరిస్థితికి దారితీసిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వుండాలని మాత్రం ప్రయత్నం చేయము .. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కానిది కాని , ఒక్కరితో మొదలై ఎందరినో సమకూర్చుకోవచ్చు .. కానీ ఆ ఒక్కరము ముందుకు రాము .. భయం .. మనవి పిరికి ఆత్మలు .. ఆత్మహత్య పిరికితనం అంటాము .. కాదు. ఏంటో ధైర్యం వుంటేనే గాని ఆ పని చేయలేరు .. ఇది నిజం   .
అసలు ఈ హత్యలూ , ఆత్మహత్యలూ ఏమిటి ?ఎందుకు ?
ఒత్తిడి భరించలేక ఆత్మహత్య , అప్పులు తీర్చలేక ఆత్మహత్య, ప్రక్కవారు ఏదో అన్నారని ఆత్మహత్య ..
మనది కుటుంబ వ్యవస్థ . కుటుంబం అంటే సహజీవనం .. ఒకరికోకరుగా తోడుగా నీడగా వుండాలని , ఒకరి భాద్యత మరొకరు స్వీకరించాలని కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు .. అంతే  కాకుండా వ్యవస్థని అభివృద్ధి దిశలో నడిపించడానికి కూడా కుటుంబ వ్యవస్థ సహకరిస్తుంది.  జన సమృద్ధి ఆరోగ్యకరంగా వుండే అవకాశం వుంటుంది .
అందుకే వివాహ వ్యవస్థని పరిచయం చేసారు మన పెద్దలు . . అటువంటి కుటుంబవ్యవస్థ ని కాదని అనుకుంటున్నారు ఈనాటి తరం . ఇది శోచనీయమే  .             

24, జులై 2015, శుక్రవారం

శోచనీయం : గోదావరి పుష్కరాలు

శోచనీయం : గోదావరి పుష్కరాలు: గోదావరి పుష్కరాలు . . ఎంతో పవిత్ర చరిత్ర కలవి. అందరినీ పులకరింప చేసేవి .. ఈ సందర్భంగా ...  , ... బృహస్పతి  సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గ...

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు .. ఎంతో పవిత్ర చరిత్ర కలవి. అందరినీ పులకరింప చేసేవి .. ఈ సందర్భంగా ...  , ... బృహస్పతి  సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు జరుపుతారు ముద్గలుడు అనే ముని శివుని కోసం తపస్సు చేసి తనను శివునిలో ఐక్యం చేసుకోమని కోరగా తనలో వున్న అష్టవిధ శక్తులలో ఒకటైన జలంలో ముద్గలుని కలుపుకున్నాడని , అది తెలిసి బ్రహ్మ కూడా శివుని గూర్చి తపస్సు చేసి శివుడిలో వున్న జలతత్వాన్ని వరంగా ఇవ్వమని కోరగా భూమండలాన్ని కమండలంగా మార్చి , అందులో జల తత్వాన్ని నింపి బ్రహ్మకు ఇచ్చాడు శివుడు . అది చాలా శక్తివంతమైన జలం కావున ఒక మడుగుని సృష్టించి అందులో ఆ జలాన్ని పోశాడు బ్రహ్మ . ఆ జలమే పుష్కరం ఐంది అని ఎక్కడో చదివాను. బృహస్పతి మహర్షి, బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి మెప్పించి దైవ గురుత్వంతో పాటు పుష్కరుని తన వశం చేయమని అడిగాడట . అందుకు పుష్కరుడు అంగీకరించలెదు. బ్రహ్మ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు . బృహస్పతి ప్రభావం వుండే నదిలో పుష్కరుడు ఆ సంవత్సరం పాటు వుండాలి అని నిర్ణయం జరిగింది  ... ఇంకో కధ కూడా చదివాను. సమస్త జీవులు మహా నదులలో తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటుంటే ఆ నదులన్నీ పాపపంకిలమై పోతాయి..  జీవుల పాపాలతో నిండిన నదులు తిరిగి పవిత్రతను ఎలా పొందగలవు అనే సందేహం కలిగింది పుష్కరుడు అనే బ్రాహ్మణుడికి.  జీవుల పాపాలను పునః పావనం చేసేందుకు ఏదైనా చేయాలనుకుని, శివుని కోసం తపస్సు చేయగా, శివుడు సంతసించి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు . నదులను పునఃపావనం చేయగల జలసిద్ధి ప్రసాదించాలని వేడుకొన్నాడు పుష్కరుడు . వరం అనుగ్రహించాడు పుష్కరుడు .. అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు పుష్కర తత్వాన్ని తన కమండలంలో భద్రపరచుకున్నాడు బ్రహ్మ .. అహల్యను వంచించిన దేవేంద్రుని గౌతముడు శాపం ఇవ్వగా ఇంద్రుడి
శరీరం అంతా  స్త్రీలింగాలు   ఏర్పడతాయి. తన వికృత రూపాన్ని భరించలేని ఇంద్రుడు తరుణోపాయం కోసం దేవగురువు ఐన బృహస్పతిని ఆశ్రయించగా బృహస్పతి ఆతడిని బ్రహ్మ వద్దకు తీసుకు వెళ్లి ప్రార్ధిస్తాడు . అప్పుడు బ్రహ్మదేవుడు మందాకినీ వద్ద ఒక సరోవరాన్ని సృష్టించి అందులో తన కమండలంలోని జలాన్ని ప్రోక్షిస్తాడు .  అందులో   స్నానం చేసిన ఇంద్రుడు తన పూర్వ రూపాన్ని పొందడం చూసిన బృహస్పతి పుష్కర జల మహిమకు చకితుడై తనకూ పుష్కర తత్వాన్ని కల్పించాలని బ్రహ్మ దేవుడిని వేడగా బ్రహ్మదేవుడు  అనుగ్రహిస్తాడు.  . పుష్కర జల మహిమ ముల్లోకాలకూ ప్రాకి మహా నదులన్నీ పుష్కర సంగమం కొరకై బ్రహ్మని ప్రార్ధిస్తాయి.  బ్రహ్మదేవుడి నిర్ణయం మేరకు గురుడు ఒక్కో రాశిలో ప్రవెశించెటపుడు పన్నెండు రోజులు, ఆ రాశిని విదిచేముందు పన్నెండు రోజులు  చొప్పున పన్నెండు నదులలో వుండేందుకు పుష్కరుడు అంగీకరించగా పుష్కర కాలంలో ఆ నది తీరాన జరిపే జపహోమాదులు, పితృ తర్పణలు, దాన ధర్మాలు సహస్రాదికంగా ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి ..    
ఇదేమిటి , హెడింగ్ శోచనీయం అని పెట్టి ఆధ్యాత్మిక వివరాలు ఇస్తుంది అని అనుకుంటున్నారు కదూ .. అసలు విషయానికి వస్తాను. . ఎన్నో సంవత్సరాల నుండి మనసులో ఏదో దిగులు , గాయాలు , ఒత్తిళ్ళు .. నా కోసం కాదు .. సమాజంలో జరుగుతున్నవిషయాలు  ,కలుగుతున్న పరిణామాలు గురించి .. ఒకోసారి ఒకో దెబ్బ , ఒకోసారి ఒకో గాయం .చాలా లోతుగా ..సునామీ - ప్రకృతి వైపరీత్యం .. గాలీ వానా- ప్రకృతి వైపరీత్యం...  మరి అగ్ని ప్రమాదాలూ ,హత్యలు , ఆత్మహత్యలూ ?  .ఏ  సమస్యకైనా సమాధానం వుంటుంది ,   అసలు సమస్య అన్నది లేనే లెదు. అన్నీ మన చేతుల్లోనే వుంటాయి . వాటిని మనకి అనుగుణంగా మలచుకోవడంలో మనం సమర్ధులం కావాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే .. నిజమే .. అన్నిటికీ ఒక అంతం అనేది వుంటుంది . మరి ఎందుకీ అలజడి అంటే , కొన్ని సమస్యలు కాదు కాదు మనకి నిత్యం ఎదురవుతున్న విషయాలు మనకి అన్నీ వున్నా సంతోషంగా వుండనీయడం లేదు .. తాత్కాలిక మార్పులు మనకి సంతోషం ఇవ్వడం లేదు . సినిమా రెండు గంటలు లేదా కొన్ని గంటలు , ఐస్క్రీం మన నోటిలో కరిగిపోయెంతవరకూ మనకి ఆనందాన్ని ఇస్తాయి . అఫ్కోర్స్ ఆ ఫ్లేవర్ వుంటుంది మిగిలి అనుకోండి  ....కాని మనల్ని సతమతం చేస్తున్న సమస్యలు ఎన్నో . వాటిలో ఈ గోదావరి పుష్కారాల వుదంతం .  ఎదురు చూపులు , వాదనలు , ప్రతివాదనలు ... విపరీతాలు , మరణాలు, యాక్సిడెంట్లు, ఎన్నో కధనాలు , మరెన్నో డిస్కషన్లు .. పరిషారం ? పది లక్షల పరిహారం .. ఇంతేనా .. ఇదేనా ?? కాదు కాదు ఏదో వుంది అది తెలుసుకోవాలి ముందు .. అందుకే నా మనసులో మెదిలే ఆలోచనలు నా వరకే పరిమితం చేసుకోకుండా ఇలా షేర్ చేయాలని ఎప్పట్నుండో ఆలోచన ... అందుకే ఈ ప్రయత్నం .. వెరసి ఫైనల్ కన్క్లుజన్ ఫర్ టుడే ఇస్ ---గోదావరి పుష్కరాలు మనకి పుణ్యం మిగిల్చి తనలో మన పాపాల్ని కడిగేస్తే ,తనలో అడుగు పెట్టకముందే ప్రాణాలు కోల్పోయిన వారికి దొరికింది పుణ్యమా , పాపమా ?  కారకులు రాజకీయమా , వారి పూర్వజన్మ కర్మల ఫలమా ??????????????      
నా ఆలోచన ... దేశంలో ఎన్నికలు జరగవచ్చు , మనకి నచ్చిన నాయకులని ఎన్నుకోవచ్చు .. అధికారం కొందరికి వుంటే మిగిలిన వారికి వారిని ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది ..  ప్రతి పక్షానికే కాదు సామాన్య  మానవునికి కూడా ఆ అధికారాన్ని ఇచ్చింది .. ఒక్క ప్రశ్నించడం లోనే ఆగిపోకుండా అధికారం లో వున్న ఎవరికైనా తమ సహకారం అందించకూడదని ఎక్కడైనా వ్రాసి వుందా .. ? కేవలం విద్యార్ధులు , కొంతమంది ప్రజలు మాత్రమె ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ వుంటే మిగిలిన వారు ? నాకేమని అనుకోబట్టే కదా ఇన్ని ఆపదలు ,అవాంచనీయ సంఘటనాలు ... తోసుకుని మరీ దేవుడి దర్శనం కావాలా ? నలుగురిని త్రొక్కి మరీ పుణ్యం సంపాదించుకోవాలా ? 
ఇక నాకు తెలిసిన  ప్రత్యక్ష అనుభవం .. (వృద్ధుల్ని,పసిపాపల్ని  తీసుకురావద్దు అని ఈ ఘటనల తర్వాత మీడియా లో ప్రచారం .. అంతకు ముందు ఏమైంది ? ).. 
మాకు  తెలిసిన ఆమె  మామగారు ఎంత  చెప్పినా వినకుండా ,ఈ దుర్ఘటన మీడియా లో చూసికూడా గోదావరి పుష్కరాలకు వెళ్ళాలి అని పట్టుబడితే ,తప్పక...  తీసుకువెళ్లారు ..  స్వంత వాహనం అయినా రద్దీ దృష్ట్యా ఒక కిలో మీటర్ దూరం లో ఆపబడింది ..విపరీతమైన ఎండ .. ఆమె మామగారు కోటిలింగాల రేవు ఇంకా అర  కిలో మీటర్ దూరం    వుంది అనగా జంక్షన్ లో (గమనించండి , చుట్టూ ఏంతోమంది పోలీసులు, వారి వాహనాలు రెండో ,మూడో వున్నాయి .. స్పెషల్ కలెక్టర్,ఆయన చుట్టూ మందీ మార్బలం  కూడా వున్నారు ) అమ్మో, నేనింక రాలేను అని ఆయన చేతులెత్తేశారు .. వెనక్కి రాలేక, ముందుకి తీసుకు వెళ్ళలేక అసహాయతతో   పోలిసుల హెల్ప్ కోరితే సబ్ ఇన్స్పెక్టర్ కోసం వెదికారు .. ఆతను ఆ స్పెషల్ కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. విషయం చెప్తే స్పెషల్ కలెక్టర్ వైపు చూపాడు .. వెంటనే స్పెషల్ కలెక్టర్ దగ్గరకి వెళ్లి సహాయం కోరితే ఆయన స్పందించి ఎవరికో కాల్ చేసి అర్జెంటు గా వాహనం పంపమని కొరారు.. కాని రాలేదు .. పది నిమిషాల తర్వాత అతను తన కార్ లో ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు --సారీ , ఐ యాం హెల్ప్ లెస్ అని ..చెప్పి . దానికన్నా తన వాహనం లో ఈ పెద్దాయనని తీసుకు వెళ్లి వదిలిపెట్టాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు ఆ ఐ .ఏ .ఎస్  కి... ? 108 ఖాళీగా తిరుగుతుంది కాని, ఇటువంటి వారిని గమనించి ఎందుకు సహాయం చేయలేదు ?  రోడ్ల నిండా మంచినీళ్ళ పాకెట్లు ..ఎంత అనౌన్సు చేస్తున్నా వినలెండి స్థితిలో వున్నారా యాత్రికులు ? ఎవరిదీ తప్పు ?   
చిరంజీవి సినిమా రిలీజ్ ఐతే టికెట్స్ కోసం తొక్కిసలాటలో ప్రాణం వదిలిన ఘటనలో ఆ చనిపోయిన వాడికి పుణ్యం దొరికిందా ,లేదా చిరంజీవి కోసం చనిపోయిన ఆనందం దొరికిందా -- ఇది తెలియాలంటే నేనూ పైకి వెళ్ళాలి మరి ... 18 ఎకరాల పొలం వున్న రైతు  బోర్ల కోసం ఋణం తీసుకుని, ఋణం తీర్చలేక రుణ మాఫీ కోసం ఎదురు చూస్తె తీర్చలేదనే ఆత్మహత్యా .....   
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ? .......