27, జులై 2015, సోమవారం

తెల్లవారు ఝామున ,బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేచి ....... ?
లేస్తే ? చాలా చాలా మంచిది .. ఇది అందరికీ తెలిసిన విషయమే . మరల మరల తెలుస్తున్న విషయమే .. కొన్ని విషయాలు అంతే .. ప్రతి సారీ క్రొత్తగా తెలుస్తూనే వుంటాయి .. సూర్యోదయం , సూర్యాస్తమయం బట్టి మన పగలు ఏం  చేయాలి, ఏం చేయకూడదు ,రాత్రులు ఏం చేయాలి , ఏం చేయకూడదు అన్న నియమాల్ని పెద్దలు{పూర్వీకులు } వివరించారు .. ఆరోజుల్లో నిష్టగా ,నియమంగా ఆచరించారు ,ఆచరించి చూపారు తరువాతి తరాలకు. అనుభవజ్ఞుల్ని తేలికగా చూడకూడదు . ఇప్పుడు జరుగుతున్నది అదే ......
సూర్యోదయానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజ చేసుకోవాలి లేదా ధ్యానం చేసుకోవాలి లేదా వ్యాయామం చేసుకోవాలి అనేది ఒక నియమం .. కారణం నిద్రలో ముందురోజుకి సంబంధించిన సంఘటనల ప్రభావం తాలూకు కలలు ,వాటిద్వారా కలిగే  మానసిక అలజడులు మరుసటిరోజుకి కొనసాగకుండా ఆరోజు ప్రశాంతంగా గడవాలి .. ఒక విషయం గమనించాలి .-- మనసుకి , శరీరానికీ అవినాభావ సంబంధం  వుంది .. మన బ్లాగర్ ఉమాదేవి గారు అనుకుంటా జ్యోతి గారు అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం పంపారు - శరీరానికి జ్వరం వచ్చింది . మనసు విలవిలలాడింది . మంచి వాఖ్య .. ఈ సూర్యోదయాన నిద్రలేవడం వల్ల ఆ సమయంలో ఎటువంటి రణగొణ ద్వనులు వుండవు . వాతావరణం ఒకరకమైన ప్రశాంత స్థితిలో వుంటుంది . చల్లటి గాలులు వీస్తాయి. మనకి అవసరమైన ఆక్సిజెన్ సరఫరా కాలుష్యం లేకుండా వుంటుంది .. ఇంత మంచి స్థితి మనం అనుభవిస్తే మనసు ,శరీరం ఒక రకమైన తేలిక భావనతో , ప్రశాంతంగా తదుపరి ఎంతటి పని అయినా చేయడానికి సిద్ధపడిపోతుంది ... ఫలితం మంచిగా వుంటుంది .. అందుకే విద్యార్ధులని కూడా తెల్లవారు ఝామున చదువుకోమని చెప్తూ వుంటాము ..

ఇక నా ఆలోచన ఏమిటంటే పూర్వపు రోజుల్లో స్కూల్ పని వేళలు  చాలా లీజర్  గా   అంటే పది గంటల సమయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమె వుండేవి .. ఆనాడు తెలివితేటలు కలిగిన , అధికారాల్లోనికి వచ్చిన విద్యార్ధులు లేరా ? 
ఒత్తిడి అన్న మాట అప్పుడు వుండేదా ? ఆరోజుల్లో ప్రజలు హాయిగా లేరా ?
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈనాటి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం అన్నది గృహిణులు నోట్లో నీరు కూడా పోసుకోలేనంతగా హడావిడిగా వంటగదిలోనికి పరుగులు పెట్టేంత స్థితికి దిగజార్చింది ..తెల్లవారి   నాలుగు లేదా ఐదు  గంటల నుండి ఇంటిలోని వారు వారి వారి పనులమీద బయటకి వెళ్ళేంతవరకూ వురుకులూ , పరుగులూ... ఆ తర్వాత నెమ్మదిగా తన బ్రష్ ,స్నానం , ఉపహారం ఇవన్నీ అయ్యేసరికి పన్నెండు .. ఇది ఒత్తిడి కాదా .. ఇది మన ప్రాచీన నియమాన్ని ఉల్లంగించడం కాదా ? ఇక ఆరోగ్యం ఎక్కడినుండి వస్తుంది చెప్పండి .
గృహిణి ,హౌస్ వైఫ్ నుండి హోం మేకర్ గా పదం మారింది .. కరెక్టే .. కానీ స్థితి మారలేదు .. ఇల్లాలు ఆరోగ్యంగా వుంటే ఇల్లు బాగుంటుంది .. ఇల్లు బాగుంటే ఇంటిలో నివాసం వున్నవారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలకాలం వర్ధిల్లుతాయి .. అంతేతప్ప అసలు మూలం వదిలేసి కొంచెం తేడా చేసినా గుడులకీ ,గోపురాలకీ పరుగులు పెట్టడం అవసరమా ?
కొసమెరుపు : ఎవరికొ ఒంట్లో బాగోలేదు .. డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మానేసి ఇంకెవరి దగ్గరకో పరుగులు తీసారట చేతబడులు చేసారు అందుకే ఆరోగ్యం పాడయింది అని.. ఆశ్చర్యం అనిపించింది .. మన అనారోగ్యం మన విధి విధానాల బట్టే కదా .. బాగున్నా , పాడినా మనకి  మనమే కారణం .. కాదా     


       










         .    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి