శోచనీయమే .. పెద్ద నోట్లు రద్దు . పెద్ద నోట్లే సరఫరా .. చిల్లర కు డిమాండ్ . ఆగిన ట్రాన్సాక్షన్స్ . మీడియా లో అరుపులు ,కేకలు .. రోడ్డెక్కిన జనాభా .. వీటన్నింటి మధ్యా ఎస్ బి ఐ 7000 కోట్ల రుణమాఫీ .. ఉన్నవాడే ఎప్పుడూ అదృష్టవంతుడు. మర్యాదలూ వారికే హక్కు . రుణాలూ వారికే హక్కు .. ఆదాయపన్ను మినహాయింపులు ,రుణమాఫీలు .. సమాజంలో విస్తృతంగా ,సగర్వంగా బ్రతికే, దర్జాగా బ్రతికే హక్కూ వారిదే మరి .. చిల్లర నోట్లకు , ఓట్లకు మాత్రమే డబ్బులేని వారు పరిమితం .. అర్ధరూపాయి విలువ కేవలం పేదవాడికే తెలుసు మరి . పెద్దవాళ్ళకి అర్ధరూపాయితో అసలు పనే ఉండదు కదా ..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి